ఉక్రెయిన్ మరో కీలక దాడి.. క్రిమియాలో
రష్యా రాజధాని మాస్కోలోకి డ్రోన్లు పంపిస్తూ పుతిన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ మరో కీలక దాడి చేసింది. క్రిమియాలో మాస్కో మోహరించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా ఎస్-400లకు పేరుంది. అయితే ఈ దాడిని రష్యా ధ్రువీకరించలేదు. మరోవైపు ఒడెసా నగరంపై పుతిన్ దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 13 వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలకు నష్టం కలిగించింది. ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి ఉక్రెయిన్ వల్ల సముద్రతీరంలోని నగరాలపై రష్యా భారీస్థాయిలో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.













