ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో విషాదకర సంఘటన
ఉక్రెయిన్, రష్యా యుద్ధం సందర్భంగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ దేశాన్ని శత్రు దేశం దాడుల నుంచి కాపడే క్రమంలో ఉక్రెయిన్ నటుడు, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ పాషా లీ(33) తన ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక పాషా లీ నటనను విడిచిపెట్టారు. ఉక్రెయిన్లోని టెరిటోరియల్ డిఫెన్స్ యూనిట్లో చేరి తమ దేశ సైన్యానికి కీలక సూచనలు, సలహాలు ఇస్తూ వారికి ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రష్యా దాడుల్లో ఆయన మృతి చెందినట్టు ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్ బుక్ ఫోస్ట్ ద్వారా వెల్లడిరచారు. కాగా ఆయన మరణించారనే వార్త తెలియడంతో పాషాలీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.













