ఆ దాడి వెనుక ఇరాన్ హస్తం : అమెరికా
ఉక్రెయిన్లోని పలు లక్ష్యాలపై ఆత్మాహుతి డ్రోన్లతో జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ప్రత్యక్ష హస్తముందని అమెరికా ఆరోపించింది. దీనికి తగిన ఆధారాలున్నాయని తెలిపింది. కొంత మంది ఇరాన్ సైనికులు క్రిమియా నుంచి ఆ డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారని, రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక మద్దతునూ అందిస్తున్నారని పేర్కొంది. అమెరికా జాతీయ భద్రత మండలి అధికారి ప్రతినిధి జాన్ కిర్బీ వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్పై దాడికి వినియోగించేందుకు ఇరాన్ నుంచి రష్యా డ్రోన్లు కొనుగోలు చేసినందని తొలుత వెల్లడించింది అమెరికానే.













