ఉక్రెయిన్ ఫై రష్యా దాడి?
ఉక్రెయిన్‌తో ఉద్రిక్తల నేపథ్యంలో రష్యా దూకుడు చర్యలు మొదలు పెట్టింది. బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఆర్మీ దళాలు ఉన్నాయి. యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అమెరికా సంస్థ మ్యాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసింది. కొద్ది వారాలుగా రష్యా సైన్యం కసరత్తులు ముమ్మరం చేసినట్లు ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. లైవ్ ఫైర్ ఫిరంగితో కూడిన సైనిక శిక్షణ కార్యకలాపాలు కూడా కొన్ని శిక్షణ ప్రాంతాలలో కనిపించాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు తూర్పున ఉన్న పోగోనోవో శిక్షణ మైదానం నుంచి వచ్చిన చిత్రాలు ఫైరింగ్ రేంజ్లో మోహరించిన ట్యాంకులకు చూపుతున్నాయి.
జనవరి 26న అదే ప్రాంతం నుంచి తీసిన మరొక చిత్రంలో లైవ్ ఫైర్ ట్రైనింగ్ దృశ్యాలు కనిపించాయి. పశ్చిమ రష్యాలోని రోస్టావ్-ఆన్ డాన్ సమీపంలోని పెర్సినోవ్స్ కి, శిక్షణ ప్రాంతాన్ని ఉపగ్రహ చిత్రాలు కవర్ చేశాయి. క్రిమియాలోని యెవ్టోరియాలోని నోవోజెర్నోయ్ లో ఫిబ్రవరి 1న తీసిన చిత్రం గుడారాల ఉనికిని చూపుతున్నది. పశ్చిమ రష్యాలోని యెల్న్, ఫొగోవోనో కుర్స్ కి, క్లింట్నీ, వెస్ట్రన్ క్లిమోవో, పెర్సివోవ్స్కి తదితర శిక్షణ స్థావరాల్లోనూ ఇదే విధమైన సైనిక సంసిద్ధత కనిపించింది.













