రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు : అమెరికా
ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టేందుకు రష్యా ఉత్తర కొరియాకు చెందిన ఆయుధాలను వినియోగిస్తోందని అమెరికా నిఘా వర్గాల నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్పై కొనసాగిస్తున్న యుద్దం కోసం వీటిని రష్యా కొనుగోలు చేయనుందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర కొరియా నుంచి లక్షలాది రాకెట్లు, ట్యాంకుల షెల్లను కొనేందుకు రష్యా యత్నాలు సాగిస్తోందని అమెరికా పేర్కొంది. ఇందు కోసం ఆయుధాలు ఎక్కడున్నా కొనేందుకు సిద్ధపడుతోందని ఆరోపించారు. ఉత్తర కొరియా వద్ద కొనుగోలు చేసిన ఆయుధాలను పూర్వపు సోవియట్ యూనియన్ ఆధాయులుగా రష్యా చెప్పుకుంటోంది. కాగా, ఉక్రెయిన్ లో రష్యా స్వాదీనం చేసుకున్న డోన్ట్సెక్ లుథెన్సాక్ రిపబ్లిక్లను ఉత్తర కొరియా గుర్తించింది.













