అదే జరిగితే.. మానవాళి మనగడకే ముప్పు
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మూడో ప్రపంచ యుద్దానికి నాంది పలకొచ్చని బిలీనియర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాకు చైనా వంత పాడుతోందన్నారు. అదే జరిగితే మానవాళి మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో ప్రనసంగించారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ప్రణాళికల గురించి చైనాకు ముందే తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ అకస్మాత్తు నిర్ణయం కాదు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ స్నేహానికి అవధుల్లేవు. ఈ విషయాన్ని వారిద్దరూ వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన భేటీలో ప్రకటించారు. ఫిబ్రవరి 4న వారిద్దరూ భేటీ అయినప్పుడు ఉక్రెయిన్లో మిలటరీ చర్యపై పుతిన్ తన ఆలోచనను జిన్పింగ్తో పంచుకున్నారు. అయితే వింటర్ ఒలింపిక్స్ పూర్తయ్యేదాకా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని జిన్పింగ్ కోరారు అని సోరోస్ తెలిపారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాడానికి యావత్ ప్రపంచం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.













