ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం
రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం కలిగిన ఖైదీలు, నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వారిని జైళ్లు నుంచి విడుదల చేస్తామని ప్రకటించింది. వీరంతా దేశ సైన్యంతో కలిసి రష్యాపై పోరాడతారని వెల్లడించింది. రష్యాపై పోరాడేందుకు జైలు నుంచి విడుదలైన మాజీ సైనికుల జాబితాలో సెర్గీ టార్బిన్, దిమిత్రీ బలాబుఖా వంటి వందలాది మంది ఉన్నారు. లంచగొండులపై పోరాడే సామాజిక కార్యకర్త కత్రినా హ్యాండ్జ్యూక్ను హత్య చేసిన కేసులో సెర్గీ టార్బిన్ శిక్ష అనుభివిస్తున్నాడు. కొంత మంది మాజీ ఖైదీలతో కలిసి టీమ్‌గా ఏర్పడి రష్యా సైన్యంపై పోరాటానికి బయల్దేరాడు. ఓ హత్య కేసులో మాజీ సైనికుడు దిమిత్రీ బలాబుకాను 2018 సంవత్సరంలో తొమ్మిదేళ జైలు శిక్ష పడిరది.













