రష్యాకు ఉక్రెయిన్ షాక్… అత్యంత కీలకమైన ఆంటోనోవ్ పై
దక్షిణ ఉక్రెయిన్లోని రష్యా సేనలకు ఆయుధాలను, సరకులను రవాణా చేయడంలో అత్యంత కీలకమైన ఆంటోనోవ్ స్కియి వంతెనపై ఉక్రెయిన్ దళాలు అమెరికా సరఫరా చేసిన హైమార్స్ రాకెట్ లాంఛర్లతో దాడి చేశాయి. ద్నీపర్ నదిపై నిర్మించిన 1.4 కిలోమీట్లర పొడవైన వంతెనపై 11 రాకెట్లు వచ్చిపడ్డాయి. అయితే తామ వంతెనను మూసివేయలేదనీ, భారీ ట్రక్కులు మినహా ప్రయాణికుల వాహనాలన్నింటినీ అనుమతిస్తున్నామని రష్యా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్లో నౌక నిర్మాణ కేంద్రమైన ఖెర్సన్ ప్రాంతానికి ఈ వంతెన ద్వారానే ప్రధానంగా రాకపోకలు జరుగతాయి. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలతో పాటు ఖెర్సన్, జాపోరిరిaయా తదితర ప్రాంతాలనూ కైవసం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోంది.













