మాకు భారత్ సాయం కావాలి
రష్యాతో శాంతి కోసం భారత్ మద్దతు కావాలని ఉక్రెయిన్ తాజాగా వెల్లడించింది. ఉద్రికత్తలు తగ్గేందుకు తాము రూపొందించిన పది పాయింట్ల తీర్మానాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో ఇండియా సహకారం తమకు చాలా కీలకమని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ చీఫ్ యాండ్రీ యెర్మాక్ పేర్కొన్నారు. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్తో యాండ్రీ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్త ఆగేందుకు మా వద్ద 10 పాయింట్ల ప్రణాళిక ఉంది. ఈ తీర్మానంలో భారత్ మద్దతుగా ఉంటుందని ఆశిస్తున్నాం. రష్యా భూమి అంగుళం కూడా మాకొద్దు. మా భూమి మాకు ఇచ్చేస్తే చాలు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా ఈ తీర్మానాన్ని రూపొందించాం. భారత్ కూడా ఈ విలువలను గౌరవిస్తుందని మేం విశ్వసిస్తున్నాం అని యాండ్రీ పేర్కొన్నారు.













