తమ మీద తమకు తప్ప.. ఈ ప్రపంచ మీద
తమ మీద తమకు తప్ప ఈ ప్రపంచం మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అసలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. నేను ఈ ప్రపంచాన్ని నమ్మను. వారు చెప్పే మాటల్ని మేం నమ్మం. రష్యాతో యుద్ధం తీవ్రమైన తర్వాత మా పొరుగుదేశాలపై విశ్వాసం లేదు. ఇప్పుడు మాకున్న నమ్మకం ఒక్కటే మా పై, మా ప్రజలపై, మా బలగాలపై నమ్మకం ఉంది. ప్రపంచ దేశాలు మాటలతో కాకుండా చేతలతో మాకు మద్దతు ఇస్తాయని నమ్ముతున్నాం అని వెల్లడించారు.













