గతంలో హిట్లర్.. ఇప్పుడు పుతిన్
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్, ఖార్కీవ్లో బాంబుల మోత మోగిపోతోంది. క్షిపణి దాడులు, పెద్ద పెద్ద బాంబు పేలుళ్లతో ఈ రెండు ప్రధాన నగరాలు, దద్దరిల్లుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాలు ఈ తరహా బాంబుల మోతలు, క్షిపణుల దాడులను ఎదుర్కోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో హిట్లర్ ఈ నగరాలను టార్గెట్ చేశారు. ఇప్పుడు పుతిన్ నాటి చరిత్రను పునరావవృతం చేస్తున్నారు. నియంత హిట్లర్ నేతృత్వంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ రెండు నగరాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి.
1940లో కూడా కీవ్, ఖార్కీవ్ నగరాలపై బాంబుల వర్షం, బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. 1941 నవంబర్ మాసంలో జర్మనీ దళాలు కీవ్‌లోకి ప్రవేశించి దాదాపు 30 వేల మంది జూస్లను ఊచకోత కోశాయి. ఆ తర్వాత కూడా జర్మన్ అధికారులు కొన్ని వేల మందినే చంపేశారని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే జర్మనీ సైన్యం కీవ్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు వారం రోజులు గడుస్తున్నా పుతిన్ సేనతు కీవ్‌ను ఆధీనంలోకి తీసుకోలేకపోతున్నాయి.













