కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉక్రెయిన్ నుంచి
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. మూడు రోజుల పాటు ప్రత్యేక విమానాల్లో భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించనున్నారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియా తొలి ప్రత్యేక విమానం డ్రిమ్లైనర్ బీ-787 ఉక్రెయిన్ బయలుదేరింది. రెండు వందలకు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ విమానం ఉక్రెయిన్ నుంచి ఈ రోజు రాత్రి 10:30 గంటలకు ఢిల్లీ చేరుకొనున్నది.













