నేడు బైడెన్ తో మోదీ వర్చువల్ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా నేడు సమావేశం కానున్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలకు దూరంగా ఉండాలని మన దేశాన్ని అమెరికా పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో ఇటీవల పరిణామాలు, ఇండో`పసిఫిక్ ప్రాంతం సహా పలు ప్రపంచ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లు భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ పరిస్థితి కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు.













