భారత్ సాయం కోరిన ఉక్రెయిన్ రాయబారి
రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ సాయాన్ని ఉక్రెయిన్ కోరింది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగర్ పోలికా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్య చేసుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వెంటనే ఉన్నత స్థాయి చర్యలు జరపాలని, ఘర్షణలను నివారించాలని కోరారు. అంతర్జాతీయంగా భారత్ చాలా ప్రభావవంతమైన దేశమని, ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని ఇగర్ కోరారు. అలీనోద్యమ నాయకురాలిగా భారత్‌కు గల పేరు ప్రఖ్యాతులను దృష్టిలో వుంచుకోవాలని అన్నారు.













