విదేశీయులుకు యూకే షాక్..భారీగా పెరిగిన!
విదేశీయుల వీసా ఫీజులతో పాటు జాతీయ ఆరోగ్య సేవకు (ఎన్హెచ్ఎస్) వారు చెల్లించే సర్ఛార్జిని పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఉపాధ్యాయులు పోలీసులు, జూనియర్ డాక్టర్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5 శాతం నుంచి 7 శాతం దాకా వేతాలను పెంచాలని స్వతంత్ర రివ్యూ కమిటీ ఒత్తిడికి తలొగ్గిన సునాక్ ఆ భారాన్ని విదేశీయులపై వేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే డబ్బును వేతనాలకు ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వీసా ఫీజులను, ఇమిగ్రేషన్ హెల్త్ సర్ ఛార్జిని పెంచాలని నిర్ణయించామని సునాక్ తెలిపారు.













