బ్రిటన్ ప్రధాని ఇంట దీపావళి సంబరాలు
విదేశాల్లోని భారతీయులు అప్పుడే దీపావళి వేడుకలు మొదలు పెట్టారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హిందువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రధాని రిషి సునాక్ తన నివాసం `10 డౌనింగ్ స్ట్రీట్లో హిందువులకు ఆతిథ్యమిచ్చారు. వారితో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి అక్షతామూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. దీనికి సంబందించన చిత్రాలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో పోస్టు చేసింది. దీనిలో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.













