రిషి సునాక్ కీలక నిర్ణయం
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ ను పదవి నుంచి తొలగించారు. కొద్ది రోజుల క్రితం లండన్లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శిస్తూ సుయెల్లా బ్రేవర్మన్ ఒక కథానాన్ని ప్రచురించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమె ఇతరులను రెచ్చగొట్టే విధంగా కథనాన్ని ప్రచురించారని, దానివల్లే పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున లండన్ వీధుల్లోకి వచ్చారని, ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ప్రధాని సునాక్ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ కేబినెట్లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు.













