భారతీయుల వీసా రుసుం తగ్గింపు !
భారతీయ ప్రయాణికులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసేందుకు ఇమిగ్రేషన్ చట్టంలో నిబంధనలను సడలించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వృతి నిపుణులకు వీసాలు తక్కువ రుసుముకే దొరుకుతాయి. భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)లో భాగంగా ఈ ప్రతిపాదనలను బ్రిటన్ చేయనున్నట్లు తెలిసింది. ఈ ఎఫ్‌టీఏపై చర్చలు జరిపేందుకు బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి ఆన్ మేరీ ట్రెవిల్యాణ్ ఈ నెలలో ఢిల్లీ రానున్నారు. మేరీ ట్రెవిల్యాన్తో పాటు ఢల్లీికి చేరుకోనున్న బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి లిజ్ ట్రస్ కూడా భారత్‌తో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బ్రిటన్‌కు వెళ్లే భారతీయ పౌరుల నుండి వర్క్ వీసా అయితే రూ.1.40 లక్షలకు పైగా (1400 పౌండ్లు), విద్యార్థుల వీసా కోసం రూ.35 వేలకు పైగా (348 పౌండ్లు), టూరిస్టుల వీసాకు రూ.9500 కు పైగా (95 పౌండ్లు) రుసుము వసూలు చేస్తున్నారు.













