బ్రిటన్ ఆర్థిక మంత్రి క్యాసిపై వేటు
బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తొలగించారు. గత నెలలో క్యానీ ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్యాసీని ఆర్థికమంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా `ఉక్రెయిన్ యుద్ద ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాలను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకులాయి. దీంతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది.













