భారత విమానాలపై యూఏఈ … నిషేధం

భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని జూన్ 30 దాకా పొడిగిస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 25 నుంచి భారత విమానాలను యూఏఈ అనుమతిచడం లేదు. ఈ నిషేధం జూన్ 14 దాకా ఉండగా, దీని జూన్ 30 దాకా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గడిచిన 14 రోజుల్లో భారత్‍ను సందర్శించిన వారెవరైనా ఇతర దేశాల మీదుగా యూఏఈకి రావడానికి కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. కోవిడ్ 19 ప్రొటోకాల్‍ను పాటిస్తే ఎమిరేట్స్ పౌరులు, గోల్డెన్ వీసాలు ఉన్నవారు, రాయబార కార్యాలయాల సిబ్బందికి ప్రయాణ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.