తొలిసారి పట్టుబడితే మా దేశంలో… వారికి జైలు శిక్ష ఉండదు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కఠినమైన మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించింది. గంజాయిలోని ప్రధాన మత్తు పదార్థ రసాయనమైన టీసీహెచ్ను తమ దేశంలోకి తీసుకొచ్చే వారిని విధించే శిక్షలను సవరించింది. ఇకపై గంజాయితో చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, ఇతర పదార్థాలను తమ దేశంలోకి తీసుకొస్తూ తొలిసారి పట్టుబడే వారికి జైలు శిక్ష ఉండదని తెలిపింది. అధికారులు మాత్రం ఆ వస్తువులను స్వాదీనం చేసుకుని నాశనం చేస్తారని వెల్లడించింది. మాదకద్రవ్యాల ఆక్రమ రవాణా, విక్రయంపై యూఏఈలో కఠినమైన ఆంక్షలున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్టు రుజువైనా ఇక్కడ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు.













