విస్కాన్సిస్‍లో కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలాన్ని సృష్టించాయి. విస్కాన్సిస్‍లోని క్యాసినోలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పులువురు గాయపడ్డారని సమాచారం. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే సదరు దుండగుడు ఓ వ్యక్తిని హతమార్చడానికి జూదశాలలోకి వచ్చాడాని పోలీసులు తెలిపారు. ఎవరి కోసమైతే వచ్చాడో ఆ వ్యక్తి కనిపించకపోవడంతో కోపంతో చుట్టుపక్కలవారిపై కాల్పులకు తెగబడ్డారు. 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.