అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం..

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి నగరంలో గుర్తు తెలియని దుండగులు ఎస్యూవీ కారులో వచ్చి పార్టీలో ఉన్న అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత దుండగులు ఈ ఘాతాకానికి పాల్పడినట్లు మియామి పోలీస్ డైరెక్టర్ అల్ఫ్రెడ్ రామిరెజ్ పేర్కొన్నారు. మియామిలోని బిలియర్స్ క్లబ్ వద్ద అర్ధరాత్రి 12 గంటల సయమలో నిస్సాన్ ఎస్యూవీ కారు వచ్చి ఆగిందని..కొద్దిసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు గన్స్తో కిందకు దిగి క్లబ్ నుంచి బయటకు వస్తున్న ఒక గుంపుపై కాల్పులుకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షి రామిరెజ్ తెలిపారు. కాల్పులు జరిగే సమయంలో 20 నుంచి 25 మంది ఉన్నారని వారిలో ఇద్దరు చనిపోయారని.. మిగత వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించామని, కాల్పులకు పాల్పడ్డ దుండగులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.