అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికాలో తుపాకీ రస్కసీ మరోసారి కోరలు చాచింది. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. వర్జీనియా రాష్ట్రంలోని నార్పోక్ నగరంలో ఓ ఇంట్లో రాత్రి విందు జరుగుతుండగా కాల్పులు చోటు చేసుకున్నారు. ఈ ఘటనలో నార్ ఫోక్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదగురికి తూటా గాయాలయ్యాయి. మరో ఘటనలో ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జాక్సన్విల్లేకు 60 కిలోమీటర్ల దూరంలోని పలట్కా పట్టణంలోని ఓ క్లబ్ వెలుపల రెండు ముఠాల మధ్య గొడవ తలెత్తింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ముగుర్గు గాయపడ్డారు.













