పక్షి లోగోకు వీడ్కోలు పలకనున్న ట్విటర్
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ లోగో నుంచి పక్షి మాయమైపోతుందని ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ట్విటర్‌కు ఆ పక్షి లోగో ప్రధాన ఆకర్షణగా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని ఆయన ట్విటర్లో వెల్లడించారు. ట్విటర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్ కార్ప్ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు కొన్నేళ్లు క్రితం మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మేం ట్విటర్ బ్రాండ్‌కు ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన ఎక్స్ లోగో బాగుంటే రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది అని తెలిపారు.













