నోప్లై జోన్ ప్రకటించండి… లేదంటే ఆయుధాలు ఇవ్వండి
తమకు మరింత సహాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన సెనేట్‌లోని ద్వైపాక్షిక సభ్యులను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ అమెరికా సెనేట్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. అమెరికా కాంగ్రెస్‌లో జెలెన్స్కీ భావోద్వేగపూరిత చారిత్రక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ గగన తలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని లేని పక్షంలో మరింత ఆర్థిక, ఆయుధ సహాయం ఇవ్వాలని అభ్యర్థించారు. మాకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు అవసరమో మీకు తెలుసు. ఈ యుద్ధం మా దేశానికి, మొత్తం ఐరోపాకు చీకటి సమయం. రష్యా దూకుడు ఆగిపోయే వరకు ప్రతివారం కొత్త ఆంక్షలు, కొత్త ప్యాకేజీలు అవసరం. వివాదాలను వెంటనే ఆపగల శక్తి , సృహ కలిగిన బాధ్యతాయుత దేశాల కూటమిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం అని తెలిపారు.













