అట్టహాసంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు
టోక్యో ఒలింపిక్స్ కు నిర్వాహకులు ఘనమైన ముగింపునిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్కు తమదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దేశ సంస్కృతికి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆట పాటలతో సాగిన ముగింపు వేడుకల్లో పొటీల్లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూడు గంటల పాటు సాగిన ముగింపు వేడుకల్లో భారత్ తరపున స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా పతాకాధికారిగా ముందు నడిచాడు. స్థానికుల నుంచి వ్యతిరేక ఎదురైనా సడలని సంకల్పంతో ముందుకు సాగిన నిర్వాహకులు మరోసారి కొవిడ్ మృతులకు నివాళులర్పించారు.
ఆరంభ ఒలింపిక్ జెండాను పారిస్ మేయర్ అన్నె హిడాల్లో చేతికివ్వడంతో టోక్యో విశ్వక్రీడలు ముగియగా అక్కడ పారిస్లో సంబురాలు ప్రారంభమయ్యాయి. 2024లో జరుగనునన మెగాటోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న ఫ్రాన్స్ రిహార్సల్స్ మొదలుపెట్టింది. భారీ జనసందోహం మధ్య ఈపిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ విమానాలు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి.













