అమెరికాలో విషాదకర ఘటన.. ఓ మూడేళ్ల బాలిక చేతిలో
అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. అభంశుభం తెలియని ఓ మూడేళ్ల బాలిక చేతిలో అనుకోకుండా పేలిన తుపాకీ నాలుగేళ్ల వయస్సున్న ఆమె అక్క ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాదకర ఘటన ఉత్తర హ్యూస్టన్లోని ఓ అపార్ట్మెంట్లో జరిగింది. ఘటన జరిగిన సమయంలో బాలికలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉన్నారు. పిల్లలిద్దరూ ఓ గదిలో ఆడుకుంటుండగా తల్లిదండ్రులు వారి పనుల్లో వాళ్లు ఉన్నారు. అయితే లోడ్ చేసిన ఉన్న ఓ సెమీ ఆటోమెటిక్ పిస్టల్ మూడేళ్ల పాపకి దొరికింది. ఆ చిన్నారి తుపాకీని పేల్చగా, బయటకొచ్చిన తూట తగిలి ఆమె అక్క అక్కడికక్కడే కన్నుమూసింది.













