అమెరికాలో మూడు వేదికల్లో
2024 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా మూడు వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనుంది. న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. బ్రౌవార్డ్ కౌంటీ (ఫ్లోరిడా), గ్రాండ్ ప్రయిరీ (డల్లాస్), ఇసెన్హోవర్ పార్క్ (న్యూయార్క్) స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. న్యూయార్క్‌తో పోలిస్తే ఫ్లోరిడా, డల్లాస్‌లో స్టేడియాల సామర్థ్యం ఎక్కువ. అమెరికాలో ఒక ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. వెస్లిండీస్తో కలిసి అమెరికా ఈ కప్‌ను నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో 20 దేశాలు పోటీపడుతున్నాయి. జార్జ్ మాసన్ యూనివర్సిటీ (వాషింగ్టన్)లో వార్మప్ మ్యాచ్‌లు, శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు.













