పాలస్తినాకు సంఘీభావంగా అమెరికాలో ప్రదర్శనలు

గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న వైమానిక దాడులను వెంటనే ఆపాలని నిరసనకారులు కోరుతున్నారు. పాలస్తీనాకు స్వేచ్ఛ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇజ్రాయిల్ పౌరుల జీవితం విలువ పాలస్తీనా పౌరుడి విలువ సమానంగా ఉండాలని కోరుతున్నాను. ఇజ్రాయిల్ అణుబాంబు ఉన్న దేశం. పాలస్తీనా బండలు గుట్టలతో కూడిన గ్రామీణ ప్రాంతంలో నిండినది. ఈ స్థితిలో ఎవరు దాడులు చేస్తారు అని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయిల్‍ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ బలపర్చడం ఆపివేయాలని కోరుతున్నారు. బాధితులను బలపర్చటం, దాడులు చేసేవారిని కాదు అని డిమాండ్ చేస్తున్నారు.