వేలంలో రూ.501 కోట్లు పలికిన డిజిటల్ ఇమేజ్!
ఓ డిజిటల్ ఇమేజ్ కోట్లు పలుకడం మనం ఎవరమూ విని ఉండం. అయితే ఈసారి ఓ డిజిటల్ ఇమేజ్ వేలంలో ఏకంగా రూ.501 కోట్లు పలకడంతో దాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ ఆ మొత్తానికి ఇమేజ్ను అమ్మేశాడు. అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకిల్మన్ ఎవిరిడేస్ -ద ఫస్ట్ 5000 డేస్ పేరుతో రూపొందించిన ఈ వర్క్ 500 ఇమేజ్‌ల సమాహారం. ఈ ఇమేజ్‌లను రోజుకొకటి చొప్పున మైక్ 13 ఏళ్ల పాటు శ్రమించి తయారు చేశాడు. క్రిస్టీస్ వేలం నిర్వహించిన ఆక్షన్‌లో డిజిటల్ ఆర్టిస్ట్ రూపొందించిన జేపీఈజీ ఫైల్ ఏకంగా రూ. 501 కోట్లకు అమ్ముడుపోయింది. వినూత్న బ్లాక్‌చైన్ టెక్నాలజీని వాడుతూ రూపొందిన ఇలాంటి డిజిటల్ ఇమేజ్‌లను ఎన్ఎఫ్టీగా కూడా పిలుస్తారు. ఈ ఇమేజ్ క్రయ విక్రయాలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరగడం గమనార్హం.













