అదృష్టం అంటే వారిదే… రూ.1140 కోట్లు లాటరీ గెలుచుకున్న జంట
లాటరీ అంటే ఒక లక్ష లేకపోతే ఒక కోటి రూపాయలో అని అనుకుంటాం. కానీ ఓ జంటకు రూ.1140 కోట్ల లాటరీ తగిలింది. అన్ని వందల కోట్లు లాటరీ తగిలితే సాధారణంగా మనుషులు ఏం చేస్తారు.. ఖరీదైన ఇల్లు కార్లు, అభరణాలు, ఆస్తులు కొంటారు. మిగిలిన సోమ్ముతో వ్యాపారం చేయడమో, ఎందులో అయినా పెట్టుబడి పెట్టడమో చేస్తారు. కానీ ఆ జంట మాత్రం తమకు అంత పెద్ద మొత్తం సొమ్ము లాటరీలో తగిలినా వారు ఆడంబారలకు పోలేదు. సెకండ్ హ్యాడ్ కారును కొన్నారు. ఇక తమకు వచ్చిన సొమ్ములో సంగం మొత్తాన్ని తమ బంధువుల, స్నేహితులు, సహాయం అవసరం ఉన్నవారికి పంచేశారు.
బ్రిటన్ కు చెందిన ప్యాట్రిక్, ఫ్రాంకోయిస్ కానాలీ అనే దంతపులకు ఇటీవల లాటరీలో 115 మిలియన్ల యూరోలు (దాదాపు రూ.1140 కోట్లు) వచ్చాయి. అయితే అంత పెద్ద మొత్తం వచ్చినా వారు ఎలాంటి ఆడంబరాలకు పోలేదు. ఓ సెకండ్ హ్యాండ్ కారును కొన్నారు. అలాగే 60 మిలియన్ యూరోలను 175 మందికి పంచారు. అందుకు గాను వారు ఓ లిస్ట్‌ను ప్రిపేర్ చేశారు. అందులో తమ బంధువలు, స్నేహితులు 50 మంది ఉండగా, మిగలిన వారు పేదలే. సహాయం అవసరం ఉన్నవారికే ఆ మొత్తాన్ని అందరికీ పంచారు. అంత పెద్ద మొత్తం వచ్చినా వారు అందులో సగం సొమ్మును ఇతరులకు పంచడంతో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతటి దాతృత్వ గుణాన్ని కలిగి ఉన్నందుకు హ్యాట్సాప్ అంటూ నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. తమకు ఆభరణాలు, ఆస్తుల కన్నా ఇతరుల కళ్లలో ఆనందాన్ని చూడడమే సంతృప్తినిస్తుందని ఆ దంపతులు తెలిపారు.













