ఆ దేశంతో మాకేం సమస్యలు లేవు
ఆఫ్ఘనిస్థాన్ పై ఆర్థిక ఆంక్షలు విధంచడం, దేశాన్ని అస్థిరపరచడం వల్ల ఎవరికైనా ఒరిగేదేమీ లేదని తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం బలహీనంగా మారితే ఎవరికి లాభమని ప్రశ్నించారు. తమకు అన్ని దేశాలతో మంచి సంబంధాలే కావాలని తెలిపారు. అమెరికాతో తమకు సమస్యలేవీ లేవన్నారు. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల డాలర్ల నిధులను ఫ్రీజ్ చేశారని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అమెరికాకు నేను చేప్పేది ఒకటే. మీది పెద్ద దేశం. గొప్ప దేశం. అలాంటి దేశానికి ఓపిక, సహనం అవసరం. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్‌లో విధాన రూపకల్పనకు పెద్ద మనసు చేసుకోవాలి. వివాదాలన్నీ తొలగిపోయేలా ఆఫ్ఘనిస్థాన్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలి అని ముత్తాఖీ కోరారు.













