తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు.. విమానాల సంఖ్య పెంచాలి
తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నేరుగా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విమానానాల సంఖ్యను పెంచాలని వాల్మీకి ట్రావెల్స్ అండ్ టూరిజం సొల్యూషన్స్ చైర్మన్ హరికిషన్ కోరారు. ఈ విషయంపై తాము గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. డిమాండ్‌కు తగినన్ని ఫ్లైట్లు అందుబాటులో లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఢిల్లీ, ముంబుయి, చెన్నై కలకత్తా నగరాల నుంచి వెళుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే ఫైట్లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల రద్దీకి తగ్టినట్లుగా నేరుగా అమెరికాకు వెళ్లే విమానాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.













