లాస్ ఏంజెల్స్ లో బిల్‍బోర్డ్ అవార్డస్ వేడుకలు..

సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే బిల్‍బోర్డ్ అవార్డస్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లో జరిగాయి. గ్రాండ్‍గా జరిగిన ఈ వేడుకల్లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రియాంక బంగారు రంగు దుస్తులను ధరించి వేదికపై మెరిసిపోయారు. నిక్ జోనాస్‍తో కలసి సందడి చేశారు. నిక్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. ఇటీవల రియాల్టీ షోలో పాల్గొన్న సందర్భంలో ప్రమాదానికి ఆయన గురయ్యారు. సెట్‍లో తగిలినవి సాధారణ గాయాలే, త్వరగా కోలుకున్నాను అని నిక్ తెలిపారు.