అమెరికాలో మరోసారి కాల్పుల మోత
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏండ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 21 మంది మరణించారు. వారిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. పోలీసుల కాల్పులో ఆ యువకుడు హతమయ్యాయడని వెల్లడించారు. సల్వడార్ రామోస్ అనే 18 ఏండ్ల యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి ప్రవేశించాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ స్కూల్‌ను చుట్టుముట్టారని, వారు జరిపిన కాల్పుల్లో గన్‌మ్యాన్ కూడా చనిపోయాడడని వెల్లడిరచారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.













