టెక్సాస్ రాష్ట్రంలో ఊహించని ఘటన
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10:25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడిరచలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం.













