టెస్లా సీఈవోకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా కార్మిక శాఖ….
టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్‌కు అమెరికా కార్మిక శాఖ వార్నింగ్ ఇచ్చింది. యూనియన్‌కు వ్యతిరేకంగా 2018లో మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అక్రమం అని, దాన్ని తక్షణమే డిలీట్ చేయాలని అమెరికా నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు పేర్కొన్నది. లేబర్ రిలేషన్స్ చట్టాన్ని మస్క్ అతిక్రమించినట్లు 2019లో జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును లేబర్ కోర్టు సమర్థించింది. తమ కంపెనీలో ఉద్యోగ యూనియన్లు చెల్లవు అని, అలా యూనియన్ పెడితే వర్కర్లకు స్టాక్ ఆప్షన్లు ఇవ్వమని మస్క్ హెచ్చరించాడు. మస్క్ చేసిన హెచ్చరికలను లేబర్ కోర్టు తప్పుపట్టింది. తొలగించిన యూనియన్ ఉద్యోగిని కూడా మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని కోర్టు చెప్పింది.













