అమెరికాలో తెలుగు యువకుడి మృతి
ఉన్నత విద్య కోసం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన బొడగల వంశీరెడ్డయ్య (23) కార్డియాక్ అరెస్టుతో హఠాన్మరణం చెందారు. వంశీరెడ్డయ్య మరణంతో ఆ కుటుంబలో విషాదం నెలకొంది. వంశీరెడ్డయ్య న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ కాలేజీలో ఎంఎస్ చదివేందుకు ఆగస్టులో అమెరికా వెళ్లారు. న్యూయార్క్ సమీపంలోని పొగెప్సిలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు. గురవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయిన వంశీరెడ్డయ్య మరునాడు ఉదయం నిద్ర లేవలేదు. దీంతో స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి వంశీరెడ్డయ్య కార్డియాక్ అరెస్టుతో చనిపోయాడని తెలిపారు. వంశీరెడ్డయ్య మృతదేహం బుధవారం నగరానికి చేరుకోవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.













