న్యూజిలాండ్ లో ఘనంగా.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను టీఆర్‍ఎస్ ఎన్నారై న్యూజిలాండ్ శాఖ ఆధ్వర్యంలో న్యూజిలాండ్‍లోని ఆక్లాండ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ టీఆర్‍ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు వొడ్నాల జగన్‍మోహన్‍రెడ్డి, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ వ్యవస్థాపకులు కాసుగంటి కళ్యాణ్ రావు, టీఆర్‍ఎస్ ఎన్నారై న్యూజిలాండ్ వ్యవస్థాపకులు కొస్నా విజయ్‍భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రామారావు రాచకొండు, తదితరులు పాల్గొన్నారు.