కువైట్ లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కువైట్‌లోని హవల్లి ప్రాంతంలోని ఎన్నారై టీడీపీ కువైట్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ ఎంపవర్మెంట్ కో ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్‌రావు మాట్లాడారు. పేదల సంక్షేమ ధ్వేయంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సేవలందించారని గుర్తు చేశారు. తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు నవ్యాంధ్రను అభివృద్ది పథంలో తీసుకెళ్లారని అన్నారు. విజన్ 2020తో ఐటీ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించాని ప్రశంసించారు. తర్వాత యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ సంబరాల్లో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













