టాటా గ్రూప్ చైర్మన్ కు అత్యున్నత పురస్కారం
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ఘవాలె డి లా లీజియన్ దోనర్ను ప్రకటించారు. భారత్`ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖరన్ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి తరపున ఐరోపా, విదేశీ వ్యవహారాల ఫ్రాన్స్ మంత్రి కాథరీన్ కోలోన్నా ఈ పురస్కారాన్ని చంద్రశేఖరన్‌కు అందజేశారు. మా చైర్మన్ చంద్రశేఖరన్ ఫ్రాన్స్ మంత్రి చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారని టాటా గ్రూప్ తెలిపింది. ఫ్రాన్స్ మంత్రి కోలోన్నా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు మా అధ్యక్షుడి తరపున పురస్కారం అందించడం ఆనందంగా ఉంది. ఆయన ఫ్రాన్స్‌కు స్నేహితుడు అని పేర్కొన్నారు.













