మాకు చెప్పకుండా ఎలా దాడి చేస్తారు
అమెరికాపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు పేల్చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు చెప్పకుండా ఈ దాడిని అమెరికా ఏకపక్షంగా ఎలా చేస్తుందని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రశ్నించాడు. ఈ డ్రోన్ దాడిలో ఏడుగురు పౌరులు చనిపోయినట్లు చెప్పాడు. అమెరికా చర్యను ఖండించారు. విదేశీ గడ్డపై అమెరికా ఇలాంటి చర్య తీసుకోవడం చట్ట విరుద్ధమని అన్నాడు. ఆఫ్ఘనిస్థాన్లో ఏదైనా ముప్పు ఉంటే దానిని మాకు ముందుగా చెప్పాలి. ఇలా పౌరులు చనిపోయేలా అమెరికా ఏకపక్ష దాడి ఎలా చేస్తుంది అని ప్రశ్నించాడు.













