మా ప్రభుత్వాన్ని గుర్తిస్తే ఇబ్బందులు ఉండవు.. ప్రపంచ దేశాలకు వినతి
ఇటీవల ఆప్ఘనిస్థాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి పాలనా పగ్గాలు అందుకున్న తాలిబన్ లు ఇప్పటికీ తమను ప్రపంచదేశాలు గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాకిస్థాన్, చైనా తప్ప మరే దేశం కూడా తమను అధికారికంగా గుర్తించకపోవడం పట్ల తాలిబన్ లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆఫ్ఘన్లో తమ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని, వివిధ దేశాల్లో నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఆస్తులపై ఉన్న ఆంక్షలను తొలగించాలని, లేకపోతే ఇది ప్రపంచ సమస్యగా మారుతుందని తాలిబ్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.













