భారత్‌కు తాలిబన్ ల విజ్ఞప్తి… ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న భారత్
అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్నాక తాలిబన్ లు మొట్టమొదటిసారిగా భారత్‌కు అధికారికంగా ఒక లేఖను పంపారు. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య విమానాల రాకపోకలకు అనుమతినివ్వాల్సిందిగా ఆ లేఖలో తాలిబన్ లు కోరారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిలిల్ ఏవియేషన్ (డీసీజీఏ)ని ఉద్దేశించి తాలిబన్లు ఈ నెల మొదట్లోనే లేఖ రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలిబన్ ల విజ్ఞప్తిని భారత పౌర విమానయాన శాఖ సమీక్షిస్తోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న రోజైన ఆసగ్టు 15న కాబుల్, ఢిల్లీ మధ్య చివరి విమాన నడిచింది. ఆ తర్వాత భారత్ విమాన రాకపోకల్ని నిలిపివేసింది.













