కీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లు
ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల నిష్క్రమణ పూర్తయినా, ఇంకా అనేక మంది అమెరికన్లు, ఇతర విదేశీయులు ఉన్నట్టు గుర్తించారు. ఆఫ్ఘన్ గడ్డపై వీరి భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 200 మంది అమెరికన్లు, పలు ఇతర దేశాలకు చెందినవారు అప్ఘన్ ను వీడేందుకు అంగీకరించారు. కాబూల్ నుంచి ప్రత్యేక విమానాల్లో వారిని తరలించేందుకు తాలిబన్లు ఒప్పుకున్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన రెండురోజుల తర్వాత ఈ మేరకు తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు.













