ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు ..చైనాకు తైవాన్ వార్నింగ్
దేశ సౌర్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ చైనాను హెచ్చరించారు. డబుల్ టెన్ డే (తైవాన్ జాతీయ దినోత్సవం) సందర్భంగా ప్రసంగించారు. తైవాన్ ప్రజలు సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య జీవన విధానాన్ని రక్షించుకోవాలని అంగీకరించారని, ఇందులో రాజీపడేది లేదన్నారు. యుద్ధంతో సమస్యలకు పరిష్కారం ఉండదన్న ఆమె ఈ ప్రాంతంలో సంబంధాల కోసం యుద్ధం ప్రత్యామ్నాయం కాకూడదని బీజింగ్‌కు అధికారులకు చెబుతున్నానన్నారు. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యంపై ప్రజల అభిప్రాయాలను గౌరవించడం ద్వారానే తైవాన్ జలసంధిలో సానుకూల చర్చలను పున ప్రారంభించగలుతామన్నారు.
తైవాన్ రక్షించడం అంటే ప్రాంతీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతో సమానమని అంతర్జాతీయ సమాజం స్పష్టంగా విశ్వసిస్తోందని సాయ్ ఇంగ్ వెన్ పేర్కాన్నారు. తైవాన్ ప్రజాస్వామ్య స్వేచ్చను నాశనం చేస్తే అది ప్రపంచ ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ అన్నారు.













