ఉక్రెయిన్ తో సిరియా తెగతెంపులు
ఉక్రెయిన్, సిరియాలు పరస్పరం దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. గత జూన్‌లో ఉక్రెయిన్‌లో రష్యా మద్దతున్న డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తిస్తామని సిరికా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్ ఆ దేశంతో కటీఫ్ చేసుకుంది. దీనికి ప్రతిగా తాము ఉక్రెయిన్‌తో సంబందాలను తెగ్గొట్టుకుంటున్నామని సిరియా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెహరాన్‌లో ఇరాన్, తుర్కియే అధినేతలతో సమావేశమైన మరునాడే సిరియా నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. సిరియాలో బషర్ అసద్ ప్రభుత్వానికి 2015 నుంచి రష్యా అండగా నిలుస్తోంది.













