టెక్సాన్ ను వణికిస్తున్న హరికేన్
అమెరికాలోని టెక్సాస్ నగరం నికోలస్ హరికేన్ దెబ్బకు వణికిపోతుంది. నికోలస్ టెక్సాస్ తీరాన్ని తాకింది. మియామిలోని నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం సార్జెంట్ బీచ్‌కు నైరుతి దిశలో 17 కిలోమీటర్ల దూరంలో మాతగోర్దా ద్వీపకల్పం తూర్పుభాగాన్ని నికోలస్ హరికేన్ తాకింది. 2021 అట్లాంటిక్ హరికేన్ సీజన్లో ఇది 14వ తుపాన్. ఈ తుఫాన్ ఉత్తర ఈశాన్యవైపు గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఉష్టమండల తుఫాన్ నికోలస్ ఆగ్నేయ టెక్సాస్ మీదుగా, నైరుతి లూసి యానా మీదగా నెమ్మదిగా కదులుతుందని భావిస్తున్నారు. 2017లో హార్వే హరికేన్‌తో దెబ్బతిన్న లూసియానా ప్రాంతంతో సహా గల్ఫ్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 51 సెంటీమీటర్లు వరకు వర్షం పడే ప్రమాదం ఉంది.













