500 ఏళ్లనాటి విగ్రహం.. భారత్కు అప్పగించిన అమెరికా
అయిదు వందల ఏళ్లనాటి పురాతన హనుమాన్ విగ్రమాన్ని భారత్కు అప్పగించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్లోని బెంజిమన్ ఫ్రాంక్లిన్ రూమ్లో దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, భారత్ ఎన్పోర్స్మెంట్ అధికారులు కలిసి 500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. దానిని భారత ప్రభుత్వానికి అప్పగించినట్లు ప్రకటించారు.
దక్షిణ భారత్లోని ఓ ఆలయంలోని 500 ఏళ్లనాటి హనుమాన్ విగ్రహం దొంగతనానకి గురైంది. దానిని అమెరికాలోని క్రిస్టీ అక్షన్ హౌస్కు విక్రయించారు. ఆ సంస్థ దానిని వేలంలో ఉంచగా ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. చివరకు ఆస్ట్రేలియాలో స్వాధీనం చేసుకున్న ఈ విగ్రహాన్ని అప్పట్లో అమెరికా అప్పగించారు. తాజాగా ఇప్పుడు అది భారత్కు చేరనుంది.













